
క్రీడలు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హజ్ యాత్ర ఖర్చులు పెరిగిన నేపథ్యంలో యాత్రికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇంధన ధరలు పెరగడంతో ఈ ఏడాది హజ్ యాత్ర వ్యయం గణనీయంగా పెరిగి, యాత్రికులపై అదనపు భారం పడింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్రికులపై పడే అదనపు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి వేలాది మంది హజ్ యాత్రకు వెళ్తుండగా, ఈసారి సుమారు 7 వేల మంది నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగించనుంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!