

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ నగదును నేరుగా జమ చేయనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది అర్హులకు ఆర్థిక భరోసా లభించనుంది. ముఖ్యంగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. కొత్తగా పింఛన్లు పొందనున్న వారిలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు. మొత్తంగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. నవంబర్ 19న వీరి ఖాతాల్లో నగదు జమ చేయనుండటంతో కొత్తగా పింఛన్లు పొందనున్న లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం ద్వారా మరింతమంది అర్హులకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!