

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరో వారం ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన షాలినీని సీక్రెట్ రూమ్‌లో ఉంచిన బిగ్ బాస్, ఏడో వారం నామినేషన్ల అనంతరం తిరిగి హౌస్‌లోకి పంపించారు. షాలినీ రీ ఎంట్రీతో రోహిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమెను చూడగానే రోహిత్ ఎంతో సంతోషంగా స్పందించి, ఎత్తుకుని గాల్లో తిప్పాడు. త్రిగుణ్ ఈ సర్‌ప్రైజ్‌లో భాగమై షాలినీ తిరిగి వచ్చిన విషయాన్ని ఇతర కంటెస్టెంట్స్‌కు తెలియజేశాడు. అయితే, ఆమె రాకపై ఇంటి సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా శివ్ ఈ పరిణామాన్ని చూసి ఆశ్చర్యానికి గురైనట్లు ప్రోమోలో కనిపించింది.
మరోవైపు, షాలినీ రీ ఎంట్రీపై రామ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేబ్జానీ లేదా నరేష్ తిరిగి వస్తే సంతోషించేవాడినని, షాలినీ రాకపై ఎందుకు ఆనందపడాలని ప్రశ్నించాడు. గేమ్ ముందుకు సాగాలంటే కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గాలని, బాగా ఆడేవారు హౌస్‌లో ఉండి, సరిగా ఆడనివారు బయటకు వెళ్లాలని అభిప్రాయపడ్డాడు. దీనికి త్రిగుణ్ స్పందిస్తూ, ఎవరు ఇంట్లో ఉన్నా గేమ్ కొనసాగుతుందని చెప్పాడు. ఇప్పుడు షాలినీ తనకు లభించిన రెండో అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది? రోహిత్‌తో తన సంబంధానికి సంబంధించిన అంశాల కంటే ఆటపై దృష్టి పెడుతుందా? ఆమె రాక రోహిత్ ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!