
రాజకీయాలు

భారతీయ రైల్వే ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్‌లో తత్కాల్ బుకింగ్ సమయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. సైట్ స్లో అవ్వడం, క్యాప్చా సమస్యలు, పేమెంట్ ఫెయిల్యూర్స్, సెషన్ టైమౌట్ వంటి కారణాలతో క్షణాల్లోనే టికెట్లు అయిపోతూ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్యలపై MNIT జైపూర్ విద్యార్థులు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలవగా, ఆయన వెంటనే స్పందించి జూలై 15 నాటికి కొత్త అప్‌గ్రేడ్ చేసిన IRCTC వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొత్త సిస్టమ్‌తో వేగం, సెక్యూరిటీ, యూజర్ అనుభవం మెరుగవుతాయని భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!