

సుప్రీంకోర్టు రాష్ట్రాల ప్రజా ప్రయోజనాలు, సామాజిక పరిస్థితులకు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో నైపుణ్యంతో కూడిన గేమ్స్ సహా వివిధ రకాల ఆన్లైన్ గేమ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం లేదా నియంత్రణలు విధించవచ్చని స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల ధర్మాసనం తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు విధించిన ఆన్లైన్ గేమింగ్ పరిమితులను సమర్థించింది. నైపుణ్య ఆధారిత గేమ్స్‌కు రాజ్యాంగ పరిరక్షణ ఉన్నప్పటికీ, అవి పందేలు లేదా బెట్టింగ్‌కు ఉపయోగిస్తే చట్టపరమైన మినహాయింపు లేకపోతే రక్షణ ఉండదని కోర్టు వెల్లడించింది.
అలాగే ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై వెనుకటి తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా విధించిన 28 శాతం జీఎస్టీకీ సుప్రీంకోర్టు మద్దతు తెలిపింది. ఫాంటసీ స్పోర్ట్స్, పూల్ స్టేక్స్ వంటి కార్యకలాపాలు సీజీఎస్టీఏ చట్టం-2017 పరిధిలోకే వస్తాయని కోర్టు పేర్కొంది. డెల్టా కార్ప్, గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ తదితర కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. దాదాపు రూ.1.12 లక్షల కోట్ల షోకాజ్ నోటీసులపై ఉన్న స్టేను ఎత్తివేయడంతో పాటు, గేమ్స్క్రాఫ్ట్కు జారీ చేసిన రూ.21,000 కోట్ల నోటీసును రద్దు చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!