
జనరల్

సంజయ్ కపూర్ కుటుంబానికి చెందిన సుమారు 30 వేల కోట్ల ఆస్తి వివాదం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వంతో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ను మధ్యవర్తిగా నియమిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాణి కపూర్, ప్రియా సచ్దేవ్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని సూచించింది.
దివంగత సంజయ్ కపూర్ ఆస్తులపై కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఫ్యామిలీ ట్రస్ట్ నియంత్రణ, పత్రాల చెల్లుబాటు అంశాలు కేసును సంక్లిష్టం చేశాయి. తదుపరి విచారణ ఆగస్టులో జరగనుంది. కుటుంబ విషయాలను బహిర్గతం చేయవద్దని కోర్టు హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!