

హిందూత్వం ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి హిందువునని నిరూపించుకోవడానికి తప్పనిసరిగా ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఆచారాలు పాటించకపోయినా లేదా ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా కూడా తన విశ్వాసాన్ని వ్యక్తపరచవచ్చని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేరళ శబరిమల ఆలయంతో పాటు పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశం, మత స్వేచ్ఛ, వివక్ష అంశాలపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
విచారణలో పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డాక్టర్ జీ మోహన్ గోపాల్ మాట్లాడుతూ, మత వర్గాల నుంచే సామాజిక న్యాయం కోసం డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. 1966లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, వేదాలను అత్యున్నత ప్రమాణంగా అంగీకరించే వారిని హిందువులుగా నిర్వచించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేసు మత స్వేచ్ఛ, సంప్రదాయాలు మరియు రాజ్యాంగ హక్కుల మధ్య సమతౌల్యంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!