
జనరల్

విజయవాడలోని బరమ్ పార్కు వద్ద కృష్ణా నదీ తీరాన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముద్రిత, దృశ్య, సామాజిక మాధ్యమాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు చేశారు. ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
రోజుకు 45 నిమిషాలు యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని వీఎంసీ క్రీడా మైదానం, అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే కూచిపూడిలో జరిగిన యోగాంధ్ర వేడుకల్లో కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కుమార్ రాజా పాల్గొని యోగా ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!