
జనరల్

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రతా ఏర్పాట్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ గర్భగుడి, ప్రాంగణంలో చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, ప్రజల్లో చర్చ మొదలైంది. ఆలయంలో వీడియో చిత్రీకరణ నిషేధం ఉన్నప్పటికీ కొందరు భక్తులు రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది.
ఈ ఘటనతో ఆలయ భద్రతా సిబ్బంది విధుల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, నిషేధిత ప్రాంతాల్లో వీడియోలు చిత్రీకరించడం ఎలా సాధ్యమైందనే అంశంపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!