
గాసిప్స్

దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా వెనక్కి మళ్లుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్న నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. సిక్కిం, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్లినట్లు పేర్కొంది.
అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాల తిరోగమనం పాక్షికంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. రుతుపవనాల ఉపసంహరణ వేగవంతం కావడంతో దేశంలో వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటోంది. ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే పరిస్థితులపై వాతావరణ శాఖ తదుపరి అంచనాలు కీలకంగా మారనున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!