

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలు, వివాదాల పరిష్కారం, పరస్పర సమన్వయం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రూ.52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కోరనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన వివిధ అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్రాల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించడంతో పాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయాన్ని పెంపొందించడమే సమావేశం ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!