
సినిమాలు

అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో 150 మంది అనుమానితులను గుర్తించిన అధికారులు, దాదాపు 25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదుగురు ప్రధాన నిందితులు ఇచ్చిన సమాచారంతో సుమారు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మందిరంలో ఓ మహిళా భక్తురాలు సమర్పించిన ఆభరణాల వ్యవహారంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 7న రామ మందిరంలో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల నిధులు దొంగిలించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!