
జనరల్

విజయవాడ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో సీఐ నాగరాజుకు సహకరించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కోసం సిట్ పోలీసులు గాలింపు చేపట్టారు. కొద్ది రోజులుగా సెలవుల్లో ఉన్న ఈ ఇద్దరి ఆచూకీ కోసం వారి మొబైల్ ఫోన్ సిగ్నళ్లను కూడా సిట్ అధికారులు ట్రాక్ చేస్తున్నారు.
మరోవైపు, సాయికృష్ణ తల్లి ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఐ నాగరాజుతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది పాత్ర కూడా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు, ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల ఆచూకీ కోసం సిట్ విస్తృతంగా గాలింపు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!