

ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యల సాగు రైతులు వరుస సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడిన రొయ్యల ధరలు తరచూ మారుతుండటంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది మేలో కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ధరలు తగ్గగా, గత నెల రూ.5, తాజాగా మరో రూ.10 మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏప్రిల్ చివరితో పోలిస్తే ప్రస్తుతం ధరలు కిలోకు సుమారు రూ.30 తక్కువగానే ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వైరస్ వ్యాధులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా రొయ్యల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీహెచ్‌పీ, వైట్‌స్పాట్, వైట్‌గట్, వైట్‌ప్లీల్ వంటి వ్యాధులతో పాటు వేసవి తీవ్రత కారణంగా రొయ్యల ఎదుగుదల దెబ్బతింది. పెట్టుబడులు భారీగా పెరిగినా మార్కెట్ ధరలు ఖర్చులను కూడా అందుకోకపోవడంతో అనేక మంది రైతులు పంటలను ముందుగానే కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్తగా సాగు విస్తీర్ణాన్ని కూడా తగ్గిస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!