

ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో ఓ యువకుడు హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు యువతులపై దాడి చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శుభమ్ ద్వివేది కొంతకాలంగా ఆ యువతులను అసభ్య సందేశాలతో వేధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో బాధితులు శివ్‌కుతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి శుభమ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై బయటకు వచ్చి తన అరెస్టుకు కారణమైన యువతులపై కక్ష పెంచుకున్నాడు.
బెయిల్‌పై విడుదలైన రోజు రాత్రి మద్యం మత్తులో హాస్టల్‌కు వెళ్లిన శుభమ్, యువతుల గది తలుపులను బలంగా కొట్టాడు. వారు తలుపు తీయకపోవడంతో బయట నుంచి గడియ పెట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత లోపలికి చొరబడి వారిపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!