

2027 సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ ముందస్తు రిజర్వేషన్ తేదీలను ప్రకటించింది. ప్రయాణ తేదీకి 60 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకునే నిబంధన ప్రకారం బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. జనవరి 14న భోగి సందర్భంగా ప్రయాణించేవారు నవంబర్ 14 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15న సంక్రాంతి రోజున ప్రయాణించేవారికి నవంబర్ 15 నుంచి, జనవరి 16న కనుమ సందర్భంగా వెళ్లేవారికి నవంబర్ 16 నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తాయి.
ఈ మూడు తేదీల్లోనూ ఉదయం 8 గంటలకు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ ప్రయాణికులకు సూచించింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!