
క్రీడలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్‌కు సంబంధించిన ప్రయాణ హెచ్చరికలను మరోసారి సవరించింది. ప్రస్తుతం ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అక్కడికి ప్రయాణించే విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇరాన్‌లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. ప్రయాణానికి ముందు అధికారిక ప్రకటనలను పరిశీలించి, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని భారతీయులకు సూచించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!