

రాష్ట్రంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి స్పెషల్ ప్రివిలేజ్ ఫీ వసూలు చేయాలనే ఉద్దేశంతో అక్టోబర్ 19న ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 205 అమలుపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఈ జీవో అమలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు బార్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. స్పెషల్ ప్రివిలేజ్ ఫీ వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది.
ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్. రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం స్పెషల్ ప్రివిలేజ్ ఫీ వసూలుకు సంబంధించిన జీవో అమలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో స్పెషల్ ప్రివిలేజ్ ఫీ వసూళ్ల విషయంలో బార్ల యజమానులకు తాత్కాలికంగా ఊరట లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!