
షోస్

గత రెండు నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది. మదర్ డెయిరీ, అమూల్ సంస్థలు పాల ధరలను లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచాయి. పాలతో పాటు పెరుగు, నెయ్యి ధరలు కూడా పెరిగాయి. డిటర్జెంట్లు, సిగరెట్ల ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రోజువారీ ఖర్చులు పెరిగి వినియోగదారుల బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది.
పశుగ్రాసం, ప్యాకేజింగ్ సామగ్రి, ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. మరోవైపు కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్, విమాన ఇంధనం (ఏవియేషన్ ఫ్యూయల్) ధరలు కూడా పెరిగాయి. ఉత్పత్తి, రవాణా, నిర్వహణ ఖర్చులపై ఈ పెరుగుదల ప్రభావం చూపుతోంది. వివిధ రంగాల్లో ఖర్చులు పెరుగుతుండటంతో మార్కెట్‌లో ధరల ఒత్తిడి కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!