

ప్రపంచవ్యాప్తంగా జియోపాలిటికల్ టెన్షన్స్, వార్స్ నేపథ్యంలో అనేక దేశాలు తమ మిలిటరీ పవర్‌ను వేగంగా పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్ వద్ద 2025 జనవరి నాటికి 190 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. పాకిస్థాన్ కంటే భారత్ వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఏడాది వ్యవధిలో భారత్ 10 వార్హెడ్లను పెంచుకున్నట్లు తెలిపింది.
అలాగే చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉండగా, రష్యా (5,420) మరియు అమెరికా (5,042) ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక తెలిపింది. భారత్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ 2025లో 92.1 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 8.9 శాతం ఎక్కువగా ఉంది. గ్లోబల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్‌లో భారత్ వాటా 8.2 శాతంగా ఉందని వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!