11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?

Writer: Chandrika 06:25 AM, 11 అక్టోబర్, 2026
వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై అతివేగం, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 120 కి.మీ. నుంచి 100 కి.మీ.కు తగ్గించాలని కోరుతూ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తికి లేఖ రాశారు. ఇదే అంశంపై ఇలంబర్తి అక్టోబరు 9న హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌)కు లేఖ పంపారు. 2023 జులైలో శాస్త్రీయ అధ్యయనం లేకుండానే వేగ పరిమితిని పెంచారని అధికారులు పేర్కొన్నారు. 2023 జులై 27 వరకు ఓఆర్‌ఆర్‌పై గరిష్ఠ వేగ పరిమితి 100 కి.మీ.గా ఉండగా, జులై 28 నుంచి 120 కి.మీ.కు పెంచారు. ఈ అంశంపై సెప్టెంబరు 18న సచివాలయంలోనూ విస్తృతంగా చర్చించారు.

ఓఆర్‌ఆర్‌పై ద్విచక్రవాహనాల ప్రవేశం, ఇతర వాహనాలను అధిగమించే సమయంలో జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌, నెమ్మదిగా వెళ్లే వాటర్‌ ట్యాంకర్లతో డివైడర్‌పై మొక్కలకు నీరు పోయడం, వాహనాలను ఆకస్మికంగా నిలపడం వంటి ఉల్లంఘనలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని సంయుక్త తనిఖీల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఓఆర్‌ఆర్‌పై పెట్రోలింగ్‌ వాహనాల సంఖ్య గతంలో 19 ఉండగా ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిదికి తగ్గిందని, కనీసం 30 వాహనాలు అవసరమని ప్రమాదాల నివారణ కమిటీ అంచనా వేసింది. గరిష్ఠ వేగ పరిమితి 120 కి.మీ.గా ఉన్న 2016, 2017లో వరుసగా 1,545, 1,562 ప్రమాదాలు నమోదయ్యాయి. వేగ పరిమితిని 100 కి.మీ.కు తగ్గించిన తర్వాత 2018లో 618, 2019లో 782, 2020లో 641, 2021లో 840, 2022లో 1,029 ప్రమాదాలు నమోదయ్యాయి. 2023లో వేగ పరిమితిని మళ్లీ 120 కి.మీ.కు పెంచిన తర్వాత ఆ ఏడాది 1,402, 2024లో 1,592 ప్రమాదాలు నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. వేగ పరిమితిపై పునఃసమీక్షతో పాటు పెట్రోలింగ్‌, రహదారి భద్రతా చర్యలను బలోపేతం చేయాలని అధికారులు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

దుర్గా నవరాత్రులు 2026: ఏనుగు వాహనంపై దుర్గమ్మ.. ఈ నాలుగు రాశుల వారికి విశేష ఫలితాలు!

దుర్గా నవరాత్రులు 2026: ఏనుగు వాహనంపై దుర్గమ్మ.. ఈ నాలుగు రాశుల వారికి విశేష ఫలితాలు!

ట్యాగ్లు
హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ఔటర్‌ రింగ్‌రోడ్డురోడ్డు ప్రమాదాలువేగ పరిమితిట్రాఫిక్‌ ఉల్లంఘనలుహైదరాబాద్‌ పోలీసులువీసీ సజ్జనర్‌రవాణాశాఖరహదారి భద్రతహెచ్‌జీసీఎల్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి
సినిమాలు

దీపావళి బరిలో విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...
జనరల్

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...
సినిమాలు

నెల్సన్‌ కథనంపై రజనీకాంత్‌ ప్రశంసలు...

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను-  సోనాలి బింద్రే
సినిమాలు

ఇతరుల కోసం నన్ను నేను హింసించుకోను- సోనాలి బింద్రే

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..
జనరల్

భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల జోరు..

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య
సినిమాలు

దర్శకుడిగా మొదలై.. విలక్షణ నటుడిగా ఎదిగిన ఎస్‌జే సూర్య

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?
క్రీడలు

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...
రాజకీయాలు

రష్యా విషయంలో ట్రంప్‌ యూటర్న్‌...

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’
జనరల్

అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు తెలుగు శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర ‘కాస్మో సర్వ్‌ స్పేస్‌’

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?
జనరల్

వేగ పరిమితి పెరిగిన తర్వాత ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరిగాయా?

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!
జనరల్

తిరుమలలో శ్రీవారి సేవకు విస్తృత రూపం.. లక్షలాది మంది భక్తులకు సేవలందిస్తున్న వలంటీర్లు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో 8 నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!