

దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఏసీల వినియోగం భారీగా పెరిగి విద్యుత్ డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీకి చెందిన ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్, క్లైమేట్ ట్రెండ్స్ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఏసీల ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచకుంటే 2028 నాటికి దేశ విద్యుత్ గ్రిడ్‌పై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి బ్లాక్అవుట్ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 270 గిగావాట్లకు చేరగా, పట్టణాల్లో పారిశ్రామిక అవసరాల కంటే గృహాల్లో చల్లదనం కోసం వినియోగించే విద్యుత్ ఎక్కువగా ఉందని వెల్లడించారు.
ఉష్ణోగ్రతలు రాత్రివేళ్లలోనూ తగ్గకపోవడంతో ప్రజలు నిరంతరం ఏసీలను వినియోగిస్తున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.5 కోట్ల కొత్త ఏసీలు మార్కెట్లోకి వస్తున్నాయి. తగిన విధానాలు అమలు చేయకపోతే 2030 నాటికి ఏసీల వల్లే 120 గిగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్, 2035 నాటికి 180 గిగావాట్ల డిమాండ్ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఏసీల సామర్థ్యాలను మెరుగుపరిస్తే విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు వినియోగదారులకు లక్షల కోట్ల రూపాయల ఆదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!