
సినిమాలు

రేవంత్ రెడ్డి ఈ నెల 26న ఖమ్మం జిల్లా మధిరలో రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. వానాకాలం సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, నిధుల విడుదల అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా సాగు పనులకు ఊతమివ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, వానాకాలం సాగు కోసం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ నిధులు రైతుల సాగు వ్యయాలను తగ్గించడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూర్చనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!