
సినిమాలు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజూ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి తొలి పాట ‘నేనో బటర్‌ఫ్లై’ ప్రోమో విడుదలైంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మెలోడీ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాయగా, సుబ్లాషిని ఆలపించారు.
ప్రేమలోని మధురమైన అనుభూతులను ప్రతిబింబించే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను జూన్ 19న విడుదల చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!