

సుందర్ పిచాయ్ యువతకు విజయానికి అవసరమైన మూడు కీలక సూత్రాలను వివరించారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో ప్రసంగించిన ఆయన, పరిస్థితులను ఎప్పుడూ సానుకూల కోణంలో చూడాలని సూచించారు. కాలిఫోర్నియాలో ఎండిపోయిన గడ్డిని తాను చూసినప్పుడు, అదే దృశ్యాన్ని మరొకరు ‘బంగారు రంగు’గా చూశారని చెబుతూ, మన దృక్పథమే జీవితాన్ని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
కెరీర్‌లో కష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని కూడా పిచాయ్ సూచించారు. గూగుల్ క్రోమ్ అభివృద్ధి సమయంలో చిన్న బృందంతో అసాధ్యమనుకున్న పనిని ఎలా సాధించామో వివరించారు. అలాగే మనకు నిజంగా ఉత్సాహాన్ని కలిగించే రంగంలోనే పనిచేయాలని, అలాంటి పనుల్లోనే దీర్ఘకాలిక విజయం, సంతృప్తి లభిస్తాయని చెప్పారు. సానుకూల దృక్పథం, కష్టమైన సవాళ్లను స్వీకరించడం, ఆసక్తి ఉన్న రంగంలో ముందుకు సాగడం విజయానికి మూల సూత్రాలని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!