

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును ఖరారు చేసే అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించిన అంశాలపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజంటేషన్ ఇచ్చారు.
గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే ఎంత మేరకు ముంపు ఏర్పడుతుంది, ఎంత నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుంది అనే అంశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే కలిగే ప్రభావాలనూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించనున్నారు. బ్యారేజీ ఎత్తు ఖరారు, ముంపు ప్రభావం, నీటి తరలింపు సామర్థ్యం వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!