
జనరల్

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. ఓటర్ల వివరాల పరిశీలన, జాబితా సవరణకు సంబంధించిన అంశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 73,39,235 మంది ఓటర్లను గైర్హాజరు, తరలింపు, మరణం, నకిలీ ఓటర్లు (ఏఎస్డీడీ) విభాగంలో గుర్తించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 92,88,187 నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఈ గణాంకాలను ఓట్ల తొలగింపుగా భావించడం సరికాదని, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సమాచారాన్ని వాస్తవాల ఆధారంగా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!