
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వచ్చే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
రెడ్ అలర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వివరించారు. వర్షాల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ సమీపంలో ఉండవద్దని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!