

ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహించారు. స్వీడన్ యువరాణి విక్టోరియా, ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్‌తో భేటీ అయిన మోదీ.. రక్షణ రంగం, సెమీ కండక్టర్లు, డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే స్వీడన్‌కు చెందిన ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
ఇదిలా ఉండగా, ప్రధాని మోదీకి స్వీడన్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ – కమాండర్ గ్రాండ్ క్రాస్’ను ప్రదానం చేసింది. ఒక విదేశీ ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే అత్యున్నత గౌరవం ఇదే. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ అందుకున్న 31వ పురస్కారంగా ఇది నిలిచింది. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ మోదీకి ఘన స్వాగతం పలకడం విశేషంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!