
సినిమాలు

నల్లగొండ జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు?” అంటూ ప్రశ్నిస్తూ, వారు క్రమంగా కనుమరుగవుతున్నారని, కొత్తవాళ్లు పార్టీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
సీఎం వ్యవహారశైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. షో ఆఫ్ ఎక్కువైందని విమర్శించిన ఆయన, యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి విషయంపై తనకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. సీఎం తీరు నచ్చకనే నల్లగొండ సభకు హాజరుకాలేదని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!