

బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అసఫూల్ మల్లిక్ జిగణి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. అతడికి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల ప్రకారం, మల్లిక్ సోషల్ మీడియా ద్వారా అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం టీటీపీకి చెందిన వ్యక్తులతో అతడు సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. భారత్, పాకిస్థాన్‌లో దాడులకు సంబంధించిన ప్రణాళికలపై చర్చలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌కు వెళ్లి ఉగ్ర సంస్థలో చేరేందుకు అతడు ప్రయత్నించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!