

భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న గూఢచారి నెట్‌వర్క్‌ను పంజాబ్ పోలీసులు బట్టబయలు చేశారు. పఠాన్‌కోట్‌కు చెందిన బల్జీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్‌కోట్-జమ్మూ జాతీయ రహదారిపై నిఘా కెమెరాలు అమర్చి, అక్కడి నుంచి వెళ్లే భారత సైన్యం మరియు పారామిలిటరీ దళాల వాహనాల కదలికలను రహస్యంగా పాక్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
తక్కువ ఖర్చుతో లభించే ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరా పరికరాలను ఉపయోగించి సైనిక కదలికలను పర్యవేక్షించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రియల్‌టైమ్ ఫుటేజీని పాక్ హ్యాండ్లర్లకు పంపుతున్నాడని, దుబాయ్ నుంచి ఆదేశాలు మరియు ఆర్థిక సహాయం అందుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి కోసం గాలింపు కొనసాగుతుండగా, పఠాన్‌కోట్ సైనిక స్థావరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!