
జనరల్

ఢిల్లీలో నిర్వహించిన కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన ప్రతినిధులందరికీ స్వాగతం పలికిన ప్రధాని, ఇదే భవనంలో ఎన్నో కీలక చర్చలు జరిగాయని గుర్తు చేశారు. ఈ భవనాన్ని ‘సంవిధాన్ సదన్’గా మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకమని ప్రధాని మోదీ అన్నారు. అయితే, ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండదని, ఎక్కువగా వినాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. స్పీకర్ న్యాయబద్ధతను, సమతౌల్యాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!