

తులసి గబ్బార్డ్ తన పదవి నుంచి వైదొలగడానికి ముందు పలు డీక్లాసిఫైడ్ పత్రాలను విడుదల చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కోవిడ్-19 మూలాలకు సంబంధించిన ఈ పత్రాల్లో, అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులు చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిగిన పరిశోధనలకు చేరినట్లు పేర్కొన్నారని ఆమె వెల్లడించారు. అలాగే మాజీ NIAID అధిపతి ఆంథోనీ ఫౌచీ కోవిడ్ మూలాలపై నిఘా అంచనాలను ప్రభావితం చేశారని, కాంగ్రెస్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
తులసి గబ్బార్డ్ ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ హయాంలో నిర్వహించిన సమీక్షలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనాతో పాటు 30కిపైగా దేశాల్లో ఉన్న 120కిపైగా జీవ పరిశోధన ప్రయోగశాలలకు అమెరికా నుంచి నిధులు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి మూలాలపై పూర్తి నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ మూలాలపై చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!