
జనరల్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో “బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు” అనే పోస్టర్లు వెలిశాయి. అతని ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, గత కొన్ని రోజులుగా భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండగా అతను పరారీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతడి కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!