
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 4న తిరుపతిలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్న అఖిల భారత DGP-IGP సదస్సులో ఆయన పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రత, శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
ఈ సదస్సుకు హాజరయ్యే పోలీసు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక యోగా కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు. పోలీసు అధికారుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా యోగా సెషన్లను ఏర్పాటు చేయనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!