
క్రీడలు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్లో పర్యటించనున్నారు. సోమనాథ్ అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే ఆయన ఆలయంలో జరిగే మహాపూజ, కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే సోమనాథ్ ఆలయ స్మారక పోస్టల్ స్టాంప్‌తో పాటు ప్రత్యేక నాణెాన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ పర్యటనకు భారీ ప్రాధాన్యత ఏర్పడింది.
సాయంత్రం 6 గంటలకు వడోదరాకు చేరుకోనున్న ప్రధాని మోదీ అక్కడ సర్దార్‌ధామ్ హాస్టల్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం రెండు వేర్వేరు సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. గుజరాత్లో మౌలిక వసతులు, ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని కీలక సందేశం ఇవ్వనున్నట్టు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!