8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

Writer: Chandrika 06:28 AM, 8 ఆగస్టు, 2026
ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

పార్లమెంటు కార్యకలాపాలకు విపక్షాల నిరసనలతో పదేపదే అంతరాయం కలుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిష్ఠంభన కారణంగా ప్రతిభావంతులైన పలువురు కొత్త ఎంపీల అభిప్రాయాలను దేశ ప్రజలు వినలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెదేపా, జనసేన, ఎన్‌సీపీఐ, శివసేన, ఆర్‌పీఐ (అఠవాలే), రాష్ట్రీయ లోక్‌ మోర్చా, అన్నాడీఎంకే, యూపీపీఎల్‌కు చెందిన 40 మందికిపైగా ఎంపీలతో మోదీ అల్పాహార సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎన్డీయేలో చేరిన ఎంపీలకు భరోసా కల్పిస్తూ.. నియోజకవర్గాల అభివృద్ధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్డీయే ఒక కుటుంబంలా వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. యోగా చేయడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీలకు సూచించారు. ప్రతి ఎంపీతో వ్యక్తిగతంగా మాట్లాడిన మోదీ, వారి సోషల్‌ మీడియా కార్యకలాపాలపై ప్రత్యేక నివేదికలను కూడా అందించినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్‌, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కీలక బిల్లులను ముందుకు తీసుకెళ్లే సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల రాజకీయంగా చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో పలువురు ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు జూన్‌లో ఆ పార్టీని వీడి ఎన్‌సీపీఐలో చేరగా, శివసేన (యూబీటీ) నుంచి బయటకు వచ్చిన ఆరుగురు ఎంపీలు శివసేనలో చేరారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు రెండుసార్లు గైర్హాజరైన ముస్లిం ఎంపీలు ఖలీవుర్‌ రహ్మాన్‌, యూసుఫ్‌ పఠాన్‌, అబూ తాహెర్‌ ఖాన్‌ కూడా మోదీతో అల్పాహార భేటీలో పాల్గొన్నారు. మరోవైపు శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ పార్లమెంటు సముదాయంలోని ప్రధాని కార్యాలయంలో మోదీని కలిశారు. వీరి మధ్య చర్చల వివరాలు వెల్లడికాకపోయినా, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా-అకాలీదళ్‌ మళ్లీ చేతులు కలిపే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్‌నాథ్‌ శిందే కూడా మోదీతో విడిగా సమావేశమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

ట్యాగ్లు
నరేంద్ర మోదీఎన్డీయే ఎంపీలుపార్లమెంటు ప్రతిష్ఠంభనఎన్డీయే భాగస్వామ్య పక్షాలుబీజేపీతెదేపాజనసేనసుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ఏక్‌నాథ్‌ శిందేపంజాబ్‌ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?
జనరల్

ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?

సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..
క్రీడలు

సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..

నయనతార, కవిన్‌ ‘హాయ్‌’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

నయనతార, కవిన్‌ ‘హాయ్‌’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..
జనరల్

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలతో స్టార్‌ హీరోల సందడి...
సినిమాలు

బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలతో స్టార్‌ హీరోల సందడి...

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..
జనరల్

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..
జనరల్

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
జనరల్

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..
జనరల్

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!