

పీఓబీ, 22ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన, సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరట కల్పిస్తామని చెప్పారు.
భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు తదితర పత్రాలను ఆగస్టు 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనివల్ల నకిలీ పత్రాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత లభిస్తుందని తెలిపారు. మరింత పారదర్శకత కోసం సబ్ రిజిస్ట్రార్లకు పహానీ రికార్డుల యాక్సెస్ కల్పించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో 22ఏకు సంబంధించిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. దరఖాస్తుల్లో నిజమైన వాటిని గుర్తించి యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!