
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండకు వెళ్లనున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 16 ఏళ్ల యువ అభిమాని నిరంజన్‌ను ఆయన పరామర్శించనున్నారు. తన అభిమాన హీరో, నాయకుడు పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలనే కోరికను నిరంజన్ వ్యక్తం చేయగా, ఆ విషయం పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా అతడిని కలవాలని నిర్ణయించారు.
హనుమకొండ చేరుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ నిరంజన్‌తో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి ఆలయం కు వెళ్లి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అభిమానిపై చూపుతున్న ఈ మానవతా దృక్పథానికి జనసేన కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!