
క్రీడలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ముస్కాన్ అగర్వాల్ కుటుంబంలో 52 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జన్మించింది. గత ఐదు దశాబ్దాలుగా ఆ కుటుంబంలో కేవలం మగపిల్లలే జన్మించగా, చాలా కాలం తర్వాత ఇంట్లో ఆడబిడ్డ రాకతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. పాప పుట్టిన క్షణంలో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురై ఆనందబాష్పాలు పెట్టుకున్నారు.
ఆపరేషన్ థియేటర్ నుంచి పసిపాపను బయటకు తీసుకురాగానే కుటుంబ సభ్యులు సంతోషంతో స్వాగతించారు. ఈ అరుదైన, ఆనందకరమైన క్షణాలను వైద్యురాలు డాక్టర్ బేలా షా జైన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!