
జనరల్

అమెరికాలోని ఇడాహో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలోని ట్విన్ ఫాల్స్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ‘ఇన్-ఎన్-అవుట్ బర్గర్’ రెస్టారెంట్ సమీపంలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు ట్విన్ ఫాల్స్ నగర ప్రతినిధి జోష్ పాల్మర్ తెలిపారు. నిందితుడు కూడా మృతుల్లో ఉన్నాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు.
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియోల్లో రెస్టారెంట్ వెలుపల ఓ యువకుడు లాంగ్ గన్‌తో కనిపించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాల్లో ప్రజలు భయంతో రెస్టారెంట్ నుంచి బయటకు పరుగులు తీస్తున్నట్లు కనిపించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ట్విన్ ఫాల్స్ నగరం ఇడాహో దక్షిణ ప్రాంతంలో సుమారు 56 వేల జనాభాతో ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!