

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏళ్లుగా నెలకొన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కొరతకు త్వరలో తెరపడనుంది. సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఓపీఎస్‌కే)గా అభివృద్ధి చేయడంతో పాటు మోడల్ పోస్ట్ ఆఫీస్‌గా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వినతికి స్పందించిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సంగారెడ్డి, పరిసర ప్రాంతాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత చేరువ కానున్నాయి.
అంతేకాకుండా సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను ప్రత్యేక పార్సిల్ యూనిట్‌గా కూడా అభివృద్ధి చేయనున్నారు. దీంతో పార్సిల్ బుకింగ్, డెలివరీ, ఈ-కామర్స్ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి రానున్నాయి. పాస్‌పోర్ట్ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి. తన వినతికి స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి ప్రజల సమస్యను గత జూన్ 29న ‘దిశ’ ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడం, అనంతరం కేంద్రం చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!