
జనరల్

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) సస్పెన్షన్ విధించింది. ఎన్పీఏ ప్రివిలేజ్ కమిటీ నిర్వహించిన విచారణలో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణకు రావడంతో ఈ చర్యలు తీసుకుంది.
సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన కమిటీ వెంటనే ఎన్పీఏ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి భారత పోలీసు సేవలో చేరిక, భవిష్యత్ సేవలకు సంబంధించిన తుది నిర్ణయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తీసుకుంటుందని ఎన్పీఏ స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!