

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నెలలు నిండని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కన వదిలేయడంతో వీధి కుక్కలు దాడి చేసినట్లు సమాచారం. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఈ ఘటన వెలుగుచూసింది. ఈ విషయం తెలిసిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గర్భస్రావం అనంతరం పసికందును అక్కడ వదిలేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా? ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి ఈ పని చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఆస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్‌ల రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!