

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన నటుడు కృష్ణుడు రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్ ప్రయాణంపై ఆయన స్పందించారు. తన వల్లే ఎలిమినేషన్ జరిగిందని, హౌస్‌లో ఫుడ్, స్వీట్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. అలాగే లైట్స్ కారణంగా నిద్ర సరిగా పట్టకపోవడంతో తలనొప్పి వచ్చిందని, దాని ప్రభావం ఆటపై పడిందని చెప్పారు.
తనపై కొందరు ట్రోల్స్ చేశారని, హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ తనను టార్గెట్ చేసి, తన పీఆర్ టీమ్‌తో ట్రోల్స్ చేయించాడని కృష్ణుడు ఆరోపించారు. అయితే ఆ కంటెస్టెంట్ ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ సీజన్ విజేతగా త్రిగుణ్‌కు అవకాశాలు ఉన్నాయని కృష్ణుడు అభిప్రాయపడ్డారు. త్రిగుణ్, రోహిత్, అమన్, ముఖేష్ గౌడ, ఝాన్సీ టాప్-5లో ఉండొచ్చని అంచనా వేశారు. దేబ్జానీ కూడా మంచి గేమ్ ఆడుతోందని, ఝాన్సీ తన ఆటతీరుతో ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!