
ఓటీటీ

నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, ఇంధన పొదుపు కోసం ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు.
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించాలని సీఎం నిర్దేశించారు. ఈవీ వాహనాల కొనుగోలుకు రుణాలు, ఈఎంఐ సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!