

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలోని బ్యాంకు ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) తదితర అంశాలపైనా యూనియన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్ 11న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించిన UFBU, సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిచ్చింది.
సెప్టెంబర్ 28–30 సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలను సమ్మెకు ముందే పూర్తి చేసుకోవాలని సూచించింది. అత్యవసర నగదు అవసరాలకు ఏటీఎంలు, నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రా యంత్రాలు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు వినియోగించాలని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. బ్యాంకులు సాధారణ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, ఉద్యోగుల సమ్మెతో శాఖల సేవలకు అంతరాయం కలగవచ్చని SBI హెచ్చరించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!