
జనరల్

ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది సంప్రదాయంగా నిర్వహించే ఈ వేడుకలను అంబానీ కుటుంబం ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించింది. దీంతో ఆంటిలియా మొత్తం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ వేడుకలకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల రాకతో అంబానీ నివాస ప్రాంగణంలో సందడి మరింత పెరిగింది. తారల తళుకులతో ఆంటిలియాలో పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!