

ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లా రుద్రపూర్‌లో ఉన్న దుగ్దేశ్వరనాథ ఆలయం ప్రత్యేకతకు నిలయంగా నిలుస్తోంది. సుమారు 2 వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని శివలింగం అప్పుడప్పుడు కదులుతుందని స్థానికులు, ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఒకసారి కదలడం ప్రారంభిస్తే గంట నుంచి 24 గంటల వరకు కదులుతుందని, ఆ తర్వాత పూర్తిగా స్థిరంగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఆలయ స్థలపురాణం ప్రకారం ఈ శివలింగాన్ని మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఉపలింగంగా భావిస్తారు.
ఈ శివలింగం మరో విశేషం ఏమిటంటే.. ఇది సాధారణంగా పానవట్టంపై కాకుండా నేరుగా భూమిపైనే కనిపిస్తుంది. లింగం భూమిలో ఎంత లోతు వరకు ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించినా దాని చివరను గుర్తించలేకపోయారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. శివలింగం కదలికకు శాస్త్రీయ కారణం ఏమిటన్నది స్పష్టంగా నిర్ధారణ కాలేదు. అయితే ఈ ఘటనను శివుడి మహిమగా భక్తులు భావిస్తూ, ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!